గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో గత నలభై ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు తో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు,చైర్మెన్ బుర్ర శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, ఛైర్మన్ మోహన్ రావు,సర్పంచ్ సాగర్ రావు,ఉప సర్పంచ్ మహేందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, మార్కెట్ డైరెక్టర్ లు, డైరెక్టర్ విజయ్, నారాయణ,గ్రామ పాలకవర్గం,తెరాస నాయకులు అశోక్ రావు, చంద్రయ్య, సుధాకర్ రావు, సురేష్, సాగర్ రావు, రాకేష్, అజయ్, ప్రజా ప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement