పెద్దపల్లి : రాష్ట్రంలోని నిరుపేదల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 101 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 34.35 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యం పాలైన, ప్రమాదాల్లో గాయపడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. పేద ప్రజలు ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీలు నూనెటి సంపత్, బండారి స్రవంతి శ్రీనివాస్, బాలాజీ రావు, జడ్పీటీసీలు బండారి రామ్మూర్తి, వంగళ తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు,పీఏసీఎస్ ఛైర్మెన్‌లు, ఏఎంసీ ఛైర్మెన్‌లు, పట్టణాధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీ-సీలు, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement