Saturday, November 23, 2024

పొలంబాట పట్టిన ఎమ్మెల్యే దాసరి..

రైతులు ఆందోళన చెందవద్దు.. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పొలంబాట పట్టారు. శనివారం పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే దాసరి పొలాస శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. ఇటీవల వరి పొలంలో విపరీతంగా పెరిగిన మొగి పురుగుపై రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో స్పందించిన ఆయన పొలాలను పరిశీలించి అన్నదాతకు భరోసా ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే తెగులును అరికట్టవచ్చని సూచించారు. మొగి పురుగు నివారణ కోసం రైతులకు సూచనలు, సలహాలు అందించి పంట పొలాలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే దాసరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పొలాస శాస్త్రవేత్తలు రజనీకాంత్‌, ఓం ప్రకాశ్‌, బలరాం, కునారం శాస్త్రవేత్త శ్రీధర్‌ సిద్ది, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడడ్‌, ఏడీఏ శ్రీనాథ్‌, ఏఓ అలివేణి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఇనుగాల అనంతరెడ్డితోపాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement