రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అక్టోబర్ ఒకటో తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తుండడంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 86.77 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 25 కోట్ల రూపాయల టియుఎఫ్ఐడిసి నిధుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఒక కోటి రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో నిర్మించనున్న పనులకు శంకుస్థాపనలు, 50 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన, నిర్మించనున్న జంక్షన్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనునన్నారు. 19.80 కోట్ల రూపాయలతో పెద్దపల్లి నుండి జూలపల్లి వరకు ఖాచాపూర్ మీదుగా నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించనున్నారు.
అలాగే 12 కోట్ల రూపాయలతో కటికనపల్లి నుండి పెద్దపల్లి వరకు నిర్మించే రోడ్డు పనులను, 7 కోట్ల రూపాయలతో పెద్దపల్లి, జూలపాల్లి వయా తుర్కల మద్దికుంట వరకు నిర్మించే రోడ్డు పనులను, 10.95 కోట్ల రూపాయలతో పెద్దపెల్లి, ఓదెల వయా జగ్గయ్యపల్లి వరకు నిర్మించే రోడ్డు పనులను, 5 కోట్ల రూపాయలతో దేవునిపల్లి నుండి దేవునిపల్లి వరకు నిర్మించే రోడ్డు పనులను, 5.52 కోట్ల రూపాయలతో బొంపల్లి నుండి అప్పన్నపేట వరకు నిర్మించే రోడ్డు పనులను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం జూనియర్ కళాశాల మైదానంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ పర్యటనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.