తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష చూపడం సరైంది కాదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కోసం చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికో పాలసీ అమలు చేయడం సిగ్గు చేటన్నారు. వన్ నెషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్‌ను అమలు చేయాలని, రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరన్నారు. ప్రతి అంశంలో రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని, రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకొవాలన్నారు. రైతుల ఏడిపించిన ఏ పాలకులు బాగుపడలేదని, రాబోయే రోజుల్లో కర్షక లోకం తమ సత్తా చూపుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతాంగం కష్టించి పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెద్దలు ధాన్యం కొనుగోళ్లలో ఓ విధమైన ప్రకటనలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు దానికి భిన్నంగా ప్రకటించడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement