Saturday, November 23, 2024

మిషన్‌ భగీరథ గోతులతో ప్రమాదాలు..

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని కమాన్‌ వద్ద మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా తవ్విన గోతులతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య ఆరోపించారు. మిషన్‌ భగీరథ పనులను పరిశీలించిన ఈర్ల మాట్లాడుతూ పది రోజులు దాటినా ఇప్పటివరకు పనులు పూర్తి కావడం లేదని మండిపడ్డారు. ప్రధాన రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికులు కూడా రెండు సార్లు కరెంటు షాక్‌కు గురయ్యారని, వారిని ఆస్పత్రికి తరలించే వారు కూడా లేరన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్‌ స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుతారి లక్ష్మణ్‌ బాబు, ఎస్పీ రాజయ్య, వేముల రాజు, పియస్‌ విజయ్‌ కుమార్‌, ఉట్ల కిరణ్‌, తమ్మడబోయిన రాజ్‌ కుమార్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement