టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు (బుధవారం) రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు వెంకట్రావుపల్లె గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభిస్తారు.
ఉదయం 11.30 గంటలకు ఛీకోడు గ్రామంలో సీసీ కెమెరాలు, డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గూడెం గ్రామంలో పీఎస్ఎస్ కమర్షియల్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సేవాలాల్ తండా జగదంబా దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పోతగల్ గ్రామంలో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.