Friday, November 22, 2024

చీర్లవంచకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా-తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో పర్యటించిన మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. చీర్లవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కే.తారక రామారావు మాట్లాడుతూ.. చీర్లవంచ గ్రామంలో ఇప్పటి వరకు రూ.12 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. చీర్లవంచ గ్రామంలో ప్లాట్ లకు డబ్బులు రాని వారు, 18 సంవత్సరాలు నిండి డబ్బులు రాని వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తెలంగాణకు మిడ్ మానేరు జంక్షన్ అయ్యిందంటే కోదురు పాక, చీర్లవంచ గ్రామాలు, ఇతర గ్రామాల నిర్వాసిత ప్రజల త్యాగ ఫలితమే అన్నారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి హబ్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. చీర్లవంచ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తామని, జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంజూరు చేస్తామన్నారు. ఎల్లమ్మ గుడి, వేణుగోపాల స్వామి ఆలయంను నిర్మిస్తామని, రజక సంఘం, రెడ్డి, గంగపుత్ర, యాదవ సహా అన్ని కుల సంఘాలకు కమ్యూనీటి భవనాలు నిర్మిస్తాం, అలాగే గోడౌన్ నిర్మిస్తామన్నారు. ఊరంతా ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని, దళితులలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు దళిత బంధు కార్యక్రమం
చీర్లవంచ గ్రామంలో దశల వారీగా దళిత బంధును వర్తింపజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గృహ లక్ష్మీ కార్యక్రమం కింద ప్లాట్ ఉండి ఇళ్లు లేని వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు రాని వారినీ గుర్తించి అర్హులందరికీ న్యాయం చేస్తమన్నారు. రూ.10 కోట్లతో రెండు నెలల్లో చీర్లవంచ గ్రామం నుండి సిరిసిల్ల వరకూ రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు.

అంబేడ్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్‌ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్‌, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు మంత్రి కేటీఆర్ స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement