Tuesday, November 26, 2024

వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థుల‌ను అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ఇద్దరు విద్యార్థులు, స్వయాన అన్నదమ్ములు.. 75 రకాల విత్తనాలను ఉపయోగించి థర్మకోర్ పై భారత దేశ చిత్రపటాలు 75 రూపొందించి వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు పొందారు. వాళ్లిద్దరు తమ తండ్రి వెల్లంపల్లి రవీందర్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త మడుపు రాంప్రకాష్ తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిశారు.
మంచిర్యాలకు చెందిన ఈ విద్యార్థులు వేదాంత్ సాయి, సిద్ధాంత్ సాయి పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్నారు. హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం వీళ్లు కలువగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement