రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈనెల 7న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. అత్యంత సుందరంగా నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ తో పాటు నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సుల్తానాబాద్ లో నిర్వహించే సభలో ప్రజలనుదేశించి మాట్లాడనున్నారు.
హరీష్ రావు పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ బహిరంగ సభ భారీ సక్సెస్ కావడంతో జోష్ లో ఉన్న గులాబీ కేడర్ కు మంత్రి హరీష్ రావు పర్యటన మరింత ఉత్సాహం నింపనుంది.