ఇల్లందకుంట: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా తెరాస మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు-, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ మాట్లాడుతూ ఆపద్బాంధవుడిగా పేదల పెన్నిధిగా నిలిచిన మంత్రి ఈటల రాజేందర్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటు-లో నిరంతరం సేవలందించాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతున్ని వేడుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ యాదవ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కళాల రాజిరెడ్డి, ఎంపిటిసి పోరం అధ్యక్షుడు మోట పోతుల ఐలయ్య, సింగిల్విండో చైర్మన్ కళ్లెం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు జేకే, సర్పంచులు గురుకుంట్ల సాంబయ్య, రామ్ మల్లయ్య, టీ.- మొగిలి, ఎంపిటిసిలు తెడ్ల ఓదేలు, కో ఆప్షన్ మెంబర్ లాల్ మొహమ్మద్తోపాటు- నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement