Tuesday, November 26, 2024

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఈటెల..

హుజురాబాద్ : వ్యవసాయ మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్, జె.సి,ఆర్ డి ఒ. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఈ నియోజకవర్గ పరిధిలో ఈసారి ఒక ఎకరం కూడా ఎండి పోకుండా మంచి పంట పండింది..ఈ ప్రాంతంలో సీడ్ కోసం మేల్ ఫిమేల్ పోగా మిగిలిన ధాన్యాన్ని అన్ని మండలాల్లో సరిపోను కేంద్రాలు ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం అన్నారు. రైతాంగం వడ్లను అలాగే తీసుకొని రాకుండా మంచిగా ఎండ బెట్టి మార్కెట్ కి తీసుకొని రావాలని మంత్రి విజ్ఞప్తి చేసారుకలెక్టర్ పర్యవేక్షణలో రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా సతాయించే ఆస్కారం లేకుండా పర్యవేక్షిస్తం అని మీకు హామీ ఇస్తున్నా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగం క్షేమమే ప్రభుత్వ క్షేమంగా భావిస్తుందన్నారు.వరికోతల సీజన్ కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వందల మంది జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కరోనా 2వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోంది. అందరూ ప్రభుత్వ సలహాలు సూచనలు పాటిస్తూ మాస్క్ ధరిస్తూ దూరం పాటించాలని కరోనా బారి నుండి కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాఅన్నారు.కరోనాని నియంత్రించేందుకు స్వీయనియంత్రనే పరిష్కారం అని అన్నారు.లాక్ డౌన్ లు కర్ఫ్యూలు ఉండే ఆస్కారం లేదు ప్రజలే వాళ్లంతట వాళ్ళు అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి అని మంత్రి సూచించారు. మనిషి ఇలాంటి పరిస్థితుల్లో స్వార్థానికి ఒడికట్టవద్దు.. మనిషి ప్రాణ భిక్ష కోసం హాస్పిటల్ కి వస్తే వాళ్ళ దగ్గర ఆశించడం అంత కన్న నీచం ఇంకొకటి లేదు..మానవత్వం ప్రదర్శించాలి కానీ ఇలా చేయడం దారుణమని… వ్యాపారకోణంలో చూడకండి అని ప్రైవేటు ఆసుపత్రి యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement