కరీంనగర్ : ప్రభుత్వ ఆసుప్రతుల్లో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో కేసీ క్యాంపులోని మంత్రి కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లవేళలా అండగా ఉంటుందని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుదని స్పష్టం చేశారు. సర్కారు వైద్యంపై నమ్మకం పెరగడంతో ప్రసవాల సంఖ్య సర్కారు దవాఖానాలలో విపరీతంగా పెరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని బస్టాండు ఆవరణలో నిర్మించిన పబ్లిక్‌టాయిలెట్స్‌ను ఈటల పరిశీలించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు బండ శ్రీనివాస్, గోపు కొంరారెడ్డి, గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement