ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడోద్దు
రెమిడెసివీర్ లెక్కల్ని పక్కాగా పరిశీలిస్తాం, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత
హాస్పిటళ్లు, డాక్టర్లు మానవతా ద్రుక్ఫథంతో ట్రీట్మెంట్ అందించండి
త్వరలో అధికారులతో విజిలెన్స్ కమిటీ
కరీంనగర్ – ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రస్థుత కరోనా సంక్షోబంలో మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. రెమిడెసివిర్ ఇతర అత్యవసర మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే పిర్యాదుల నేపథ్యంలో మంత్రి కరీంనగర్ లో కలెక్టర్ ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా అయిన రెమిడెసివీర్, ఇతర మందుల్ని ఏ పేషంట్లకు, ఎప్పుడు, ఎన్ని మెతాదులు వాడారో పక్కాగా లెక్కలు నిర్వహించాలని వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారుల ప్రత్యేక తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందితో రెండ్రోజుల్లో పటిష్ట కార్యాచరణ రూపొందిస్తామని, ఏ ఒక్క హాస్పిటల్ కాని, వైద్యులు లేదా ఇతర సిబ్బంది కానీ అక్రమంగా వీటిని నిల్వచేసినా, ఎక్కువ దరలకు అమ్ముకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసరం కోసం మినిమం దరల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రస్థుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యంతో ఎవరూ అటలాడుకోవద్దని, సామాన్య ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఇందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకు వెనుకాడమని ప్రైవేట్ హాస్పిటల్లలో అక్రమాలకు పాల్పడే వారిని హెచ్చరించారు గంగుల. అత్యవసర మందుల సరఫరా కోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడామని, ఫార్మా సంస్థలు ఆయా మందుల్ని అందించేందుకు సిద్దంగా ఉన్నారని, ప్రజలెవరూ అపోహలకు, భయాందోళనలకు గురికావద్దని పిలుపునిచ్చారు
ప్రైవేట్ హాస్పటల్స్ పై నిరంతరం నిఘా … మంత్రి గంగుల
Advertisement
తాజా వార్తలు
Advertisement