Monday, November 25, 2024

Peddapalli: 13న మెగా రక్తదాన శిబిరం.. డీసీపీ వైభవ్ గైక్వాడ్

రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలియజేశారు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 13న పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో తలపెట్టిన మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… ఆపద సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తం చాలా అవసరం అన్నారు.

రామగుండం సిపి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో 5,555 మంది యువతీ యువకులు రక్తదానం చేయనున్నారన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, నీమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు రక్తం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి మహేష్, సిఐలు అనిల్, జగదీష్, సత్యనారాయణ, పెద్దపల్లి ఎస్ఐ మహేందర్, రెడ్ క్రాస్ బాధ్యులు ఈవి శ్రీనివాస్, రాజ్ గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement