Sunday, June 30, 2024

TS: ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలి.. కలెక్టర్

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా నూతన కలెక్టర్

వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డి పేట వైద్యశాలను నూతన కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలకు సంబంధించిన రికార్డ్స్ ను పరిశీలించారు. దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూం ను, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గదిని పరిశీలించారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, జనరల్ వార్డ్ గది కిటికీలకు మస్కిటో నెట్ ఏర్పాటు చేయించాలని జనరేటర్ వినియోగంలోకి తీసుకురావాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గది పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీహెచ్ సీ ఇంచార్జీ డాక్టర్ బాబుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ… వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక్కడ డాక్టర్లు రఘు, ప్రదీప్, సీహెచ్ సీ ఇంఛార్జి డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement