రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ జే.నరసింహులు తెలియజేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… ప్రతి ఒక్క వాహనదారుడు రవాణా శాఖ నిబంధనలు పాటించాలన్నారు.
వాహనదారులందరూ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ లతోపాటు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.