Tuesday, November 26, 2024

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు : బ్లాక్ స్పాట్ ల గుర్తింపు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీస్, రవాణా, రోడ్డు భవనాల శాఖ, హెచ్ కె ఆర్ సంస్థ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దలు మరణించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఎంతో మంది క్షతగాత్రులై ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డుభవనాల శాఖ డీఈ, జిల్లా రవాణా శాఖ రంగారావు, ఎంవీ ఐ శ్రీనివాస్, పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, మహేందర్, వెంకటకృష్ణ, హెచ్ కె ఆర్ ప్రతినిధులు రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement