Friday, November 22, 2024

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు : ఏసీపీ సారంగపాణి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు ప్రారంభించామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదాల నియంత్రణ కోసం థర్మో ప్లాస్టిక్ పెయింటింగ్స్ వేయించారు. అనంతరం మాట్లాడుతూ… గత వారం ఆర్ అండ్ బీ, రవాణా, హెచ్ కేఆర్ అధికారులతో కలిసి సబ్ డివిజన్ పరిధిలో 22 బ్లాక్ స్పాట్ లను గుర్తించామన్నారు. రాజీవ్ రహదారిపై వాహనదారులు అతి వేగంగా ప్రయాణించటం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. వేగ నియంత్రణ కోసం బ్లాక్ స్పాట్ వద్ద థర్మో ప్లాస్టిక్ పెయింటింగ్స్ వేయిస్తున్నామన్నారు. త్వరలోనే రాజీవ్ రహదారిపై సూచికలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏసీపీ వెంట పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు పలువురు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement