Tuesday, November 26, 2024

మేడే వారసత్వాన్ని కొనసాగిద్దాం..

గోదావరిఖని: కార్మిక హక్కులు, ప్రజా ఆస్తుల రక్షణ కోసం పోరాటం చేస్తూ మేడే వారసత్వాన్ని కొనసాగిద్దామని ఎస్‌సీసీడబ్ల్యుయు ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేశ్‌ పిలుపునిచ్చారు. ఖని ఇఫ్టూ కార్యాలయంలో 135వ మేడే పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1886లో చికాగోలో కార్మిక వర్గం సాగిన వీరోచిత పోరాటాన్ని వివరించారు. కార్మికులు సాధించుకున్న హక్కులను పోరాటాల ద్వారా సాధించుకుందామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా ఎండగ ట్టాలన్నారు. మేడేను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ1 అధ్యక్షులు కొయ్యడ శంకర్‌, ప్రధాన కార్యదర్శి కొండ్ర మొగిలి, మాట్ల సమ్మయ్య, నేరెళ్ల రాజేందర్‌, కొయ్యడ వెంకటేష్‌, ఎర్రోళ్ల సారయ్య, గుండ్ల పోషం, లక్ష్మినారాయణ, ముల్కల హనుమయ్య, మల్లేష్‌, వాసుదేవరెడ్డి, రాజయ్య, శంకర్‌, రాజేందర్‌, దీక్ష కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement