Saturday, November 23, 2024

మాస్కులు ధరిస్తేనే కరోనా కట్టడి..

ఓదెల: రోజు రోజుకు కరోనా వ్యాప్తి చెందుతునందున ఓదెల మండలంలో ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించి దూరం పాటించాలని పొత్కపల్లి ఎస్‌ఐ శీలం లక్ష్మణ్‌ కోరారు. ఆయన పోలీసు సిబ్బందితో కలిసి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసినందున ప్రజలకి కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, మాస్కులు ధరించారో లేదో సీసీ కెమెరాల నిఘాలో పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. నిబంధనలు పాటించని వారికి రూ. వెయ్యి జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు సైతం మండలంలో ప్రజలకు అన్ని విధాలా వివరించి సహకరించాలని ఎస్సై లక్ష్మణ్‌ కోరారు. కోవీడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు నరకానికి పోతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement