Tuesday, November 26, 2024

మాస్కులు ధరించకపోతే శిక్ష తప్పదు..

పెద్దపల్లిరూరల్‌: ప్రజలు మాస్కులు ధరించకుండా బయటి ప్రాంతాల్లో సంచరిస్తే శిక్ష తప్పదని ట్రాఫిక్‌ సీఐ అనిల్‌ హెచ్చరించారు. పట్టణంలోని కమాన్‌ వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నంబరు ప్లేటు లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. మాస్కులు ధరించని వారికి కూడా జరిమానాలు వేశారు. మాస్కు ధరించకపోతే జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement