సుల్తానాబాద్: ట్రాక్టర్ డ్రైవర్స్, యాజమానులకు రోడ్డు భద్రత నిబంధనలు పాటించడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నీరుకుల్లలో మానేరు వాగు ఇసుక రీచ్ వద్ద ట్రాఫిక్ పోలీస్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశంలో గుంపులుగుంపులుగా ఉండవద్దని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్లను వాడాలని సూచించారు. అనంతరం ట్రాక్టర్‌లకు, ట్రాలీ లకు రేడియం ప్రతిబింబం స్టికర్‌లను అం టించారు. ప్రతి ట్రాక్టర్‌కి వాహన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని, ఇసుక తరలిస్తున్న సమయంలో ఇసుక ట్రాలీని పూర్తిగా టార్పాలిన్ షీట్ తో కప్పుకొని ఇసుక తరలించాలన్నారు. రాత్రిపూట రేడియం స్టిక్కర్ల ప్రమాదాలను నివారించవచ్చని, ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరుకుల్ల సర్పంచ్ విజేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement