Monday, October 21, 2024

KNR: అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి… రామగుండం సీపీ శ్రీనివాస్

గోదావరిఖని, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కలెక్టర్ దీపక్, పెద్దపల్లి డీసీపీ చేతనలతో కలిసి వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే, అసాంఘీక శక్తులచే పోరాడి అశువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక సైనికుల వీరోచిత పోరాటం మహోన్నత చరిత్ర దాగుందన్నారు. 1959 అక్టోబరు 21న భారత్- చైనా సరిహద్దున సియాచిన్ ప్రాంతంలోని భూ భాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించాయన్నారు. ఆ సమయంలో డీఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో విపరీతమైన చలిలో 10మంది సీఆర్పిఎఫ్‌ జవాన్లు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అక్సాయ్ చిన్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్ వద్ద జరిగిన పోరాటంలో పది మంది సీఆర్పిఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. భారతదేశ రక్షణ కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం ప్రాణాలు వదిలిన తొలి సందర్భమన్నారు. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారన్నారు.

పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర అన్నారు. మావోయిస్టులతో, అసాంఘీక శక్తులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామరమని, శాంతిభద్రతల పరిరక్షణలో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను ఫ‌ణంగా పెట్టారన్నారు. త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, పెద్దపెల్లి ఏసీపీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీ ఏఆర్ ప్రతాప్, సుందర్ రావు, సీఐలు, ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్స్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం, ఏఓ అశోక్ కుమార్, ఏఆర్, సివిల్, వివిధ వింగ్స్, సీపీఓ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement