ఎల్లారెడ్డిపేట: గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ప్రజలు, యాత్రికులు జలాశయాన్ని సందర్శించడానికి అనుమతి లేదని, ప్రజలు గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతోందని, జలాశయం వద్దకు ఎవరికీ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. అలాగే జలాశయం పరిసరాలలో మద్యపానం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement