Saturday, November 16, 2024

వసతుల కల్పనకే ‘మన ఊరు మన బడి’: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు, మన బడి’ పథకం ద్వారా వసతులు కల్పిస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఓదెల మండలంలోని గుండ్లపల్లిలో 4,16,000 రూపాయల నిధులతో చేపట్టనున్న పాఠశాల పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తయారుచేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతనిధులు, టీఆర్​ఎస్​ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement