కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బంజరు పల్లె గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్ తన పొట్టకూటికి కోసం గురువారం సాయంత్రంగ్రామంలో రైతుల పొలం దున్ను తు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తో సహా బావి లో పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న రైతులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బావిలో పడి మృతి చెందిన శంకర్ ని బయటికి తీయడానికి నాలుగు ఐదు గంటల పాటు శ్రమించి పోలీసులు రిస్క్ టీం సహాయంతో బయటకు తీశారు. ఇటీవల శంకర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందులో భాగంగా ట్రాక్టర్ మంజూరు అయింది.
దానితో జీవనం గడపడం కోసం పొలాలు దున్ని కుంటూ జీవనాన్ని ముందుకు సాగిస్తున్నాడు. మృతుడి భార్య ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. భర్త బాగా పడిన సంఘటన చూసి కుటుంబ సభ్యులందరూ తమ తీవ్ర రోదనలువ్యక్తం చేశారు. బావిలో పడ్డ సంఘటనను తెలుసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి స్థానిక సర్పంచ్ దుండ్రా నీలమ్మ రాజయ్య మృతికి గల స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదారిచి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివరాల ప్రకారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ ఎం డిఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.