పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి దాసరి పుష్పలత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పట్టణంలో చాయ్ హోటల్లో చాయ్ తయారు చేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకుల హయాంలో పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోలేదని గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 40ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపారన్నారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 6 గ్యారంటీలు కాదు 60 గ్యారంటీలు పెట్టినా చెయ్యికి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుతుందన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛన్లు 6000 రూపాయలకు పెంచుతారన్నారు. ప్రచారంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.