గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్ధశ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో ఎంజీ ఎన్‌ఆర్ ఈజీఎస్ పథకం ద్వారా రూ.20లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. గ్రామాలలో రోడ్ల నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్, కేడీసీసీ బీ డైరెక్టర్ సిరిగిరి శ్రీనివాస్, సర్పంచ్ స్వరూప తిరుపతి, ఎంపీటీ-సీ సంపత్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్, తెరాస పట్టణ అధ్యక్షులు గుణపతి, ఉప సర్పంచ్ పద్మ కొమురయ్యతోపాటు పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..