పెద్దపల్లి : విద్యుత్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈసందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేయాలని భావించడం సిగ్గు చేటన్నారు. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు పూనుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి రంగాన్ని కేంద్రం ప్రైవేటీకరించడం సరైంది కాదన్నారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఈ సుదర్శన్, ఈఈ లక్ష్మారెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు బొంకూరి రవీందర్, వంగళ వెంకట్ నారాయణ, ప్రభాకర్, అడిచర్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.