కేంద్ర వైఖరిని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో మహా ధర్నాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రైతాంగం ఆందోళన నిర్వహించింది. ఈ ధర్నాకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాదిగా రైతాంగం తరలి వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని నిరిసిస్తూ నినాదాలు చేశారు. కరీంనగర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ల కనుమల్ల విజయ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తోపాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement