Friday, November 22, 2024

తక్షణమే లాక్‌డౌన్‌ను విధించాలి..

మెట్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్‌ను విధించి తక్షణమే నియంత్రణ చర్యలను చేపట్టాలని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్‌ నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ టెస్టులను పెంచడంతో పాటు ప్రజలకు సరిపడా కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రుల సన్నద్ధత, బెడ్ల పెంపు, చికిత్స తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కరోనాకు వ్యాక్సినేషన్‌ అనేది ఒక్కటే శాశ్వత పరిష్కారమని, కోవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. భౌతిక దూరం, శానిటైజేషన్‌, మాస్కులను ధరించడంలాంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement