కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఓ ఇంట్లో భారీగా నిల్వ చేసిన లిక్కర్ (మందు) అధికారులకు పట్టుబడి౦ది. ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో రూ. 1.80 లక్షల లిక్కర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు పంచాలనే ఉద్దేశంతో ఓ మాజీ ప్రజాప్రతినిధి గ్రామంలోని ఓ ఇంట్లో లిక్కర్ ను దాచి ఉంచాడు. దీనిపై పూర్తి సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ మహమ్మద్ హుస్సేన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సూపరింటెండెంట్ ప్రభాకర్ తో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంట్లో నిల్వ ఉంచిన లక్ష 80 వేల రూపాయల విలువగల లిక్కర్ పట్టుబడి౦ది. ఈ సందర్భంగా భారీగా పట్టుబడిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించినట్లు ఎక్సైజ్ సిఐ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.