జూలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో కన్నం రమేశ్ దళిత బంధు యూనిట్ ద్వారా ఏర్పాటు చేసుకున్న సాక్షర మినీ సూపర్ మార్కెట్‌ను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిరుపేద దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళితబంధు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
దళిత బంధు ద్వారా లాభదాయకమైన యూనిట్లను ఎంచుకొని పేద దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. దేశంలోనే దళితబంధులాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదని, తెలంగాణలో ఈ పథకం అమలుతో కేసీఆర్ దళిత బాంధవుడిగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి రాంగోపాల్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మెన్ చొక్కారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాంతయ్య, వైస్ ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ సతీష్, రైతు బంధు గ్రామ కో ఆర్డినెటర్ శ్రీనివాస్, నర్సింగం, మల్లయ్య, శ్రీనివాస్, గిరీశం తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.