వేములవాడ: లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్‌లో ఏజెంట్‌లుగా పని చేస్తున్న వారి కుటుంబాలకు జీవితాంతం భీమా సౌకర్యం కల్పించి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేములవాడ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఏజెంట్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) ఆల్ ఇండియా ధర్నా పిలుపులో భాగంగా సిరిసిల్ల బ్రాంచ్ సాటిలైట్ వేములవాడ బ్రాంచ్‌లో ఏజెంట్స్ రెస్ట్ డే ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సమస్యలు, డిమాండ్లలతో కూడిన మెమోరాండం బ్రాంచి మేనేజర్ సురేష్ అందజేశారు. పాలసీలకు సంబంధించిన జిఎస్‌టి ఎత్తివేయాలని, భేషరతుగా బోనస్ పెంచాలని, ఏజెంట్ల గ్రాట్యుటీ 10 లక్షలకు పెంచాలని, గ్రూప్ ఇన్సూర్ టర్మ్ ఇన్సూర్ నాన్ క్లబ్ ఏజంట్లకు కల్పించాలని, ఏజెంట్ కుటుంబానికి ఆరోగ్య బీమా జీవితాంతం కల్పించాలని, 1956లో ఏర్పాటు- చేసిన కమిషన్ కాకుండా ఐఆర్ డీఏ సూచించిన కమిషన్ ఇవ్వాలని, లోన్ పై వడ్డీరేటు 7శాతం ఆలస్యంగా చెల్లించిన రెన్యువల్ ప్రీమియుంకు 7శాతంకు వడ్డీ తగ్గించాలని, ఎఫ్‌డిఐ 74 నిర్ణయంవిరమించుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు రాజూరి సత్తయ్య, గజావాడ శ్రీనివాస్, పెంట రాజేందర్, ఏముల శ్రీనివాస్, ముదాం శ్రీనివాస్, భూమానందం, వేణుగోపాల్, దేశ గౌడ్, నగరం గంగాధర్, చెర్ల మల్లేశం, రాజూరి ప్రేమచంద్, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, ఆనందరావు, సంకోజి సత్తయ్యలతోపాటు- పెద్ద సంఖ్యలో ఏజెంట్‌లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement