పెద్దపల్లి : విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కూడిన నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలని ట్రినిటీ- విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రినిటీ- సెకండరీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల ఎలక్షన్ డే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్లాస్ రూమ్ లీడర్‌ను ఎంచుకోవడంలో ఒక సమదృష్టి పాటించడమే కాకుండా ఓటింగ్ విధానాన్ని కూడా అలవర్చుకోవడానికి ఈ ఎలక్షన్ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఆయా తరగతుల వారీగా విద్యార్థులు తమ ఓటింగ్ ద్వారా నాయకుడిని ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ రణధీర్ రెడ్డి, ఉపాధ్యాయులు కుమారస్వామి, అంజయ్య, శ్రీనివాస్, ఇన్నారెడ్డి, రాకేష్ వర్మ, కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement