ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలకత్త లో జరుగుతున్న జాతీయ స్థాయి సమావేశాలకు, ర్యాలీలో టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోల సంఘ నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశాలకు సుమారుగా 29 రాష్ట్రాల ప్రతినిధులు అదేవిధంగా తెలంగాణ నుండి 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో జాతీయ స్థాయి సమస్యలైనటువంటి సిపిఎస్ విధాన యొక్క రద్దు ,పి.ఎఫ్.ఆర్ .డి.ఏ చట్టం రద్దు ,కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్ , ఇన్కమ్ టాక్స్ పరిధిని పదిలక్షలకు పెంచాలని డిమాండ్లను పరిష్కరించాలని ఇట్టి తీర్మానాలను ఏకవాక్య తీర్మానంగా ప్రవేశపెట్టిన జాతీయ నాయకులకు రాష్ట్రస్థాయి జిల్లా అధ్యక్షులందరూ ఆమోదం తెలిపారు. జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మీందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, జిల్లా జాయింట్ సెక్రటరీ బాస పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.