కరీంనగర్ మేయర్ సునీల్ రావు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీని తిరుగులేని శక్తి గా మలచడంతో పాటు నగరాలను, పట్టణాలను రూపు రేఖలు మార్చిన వ్యక్తిగా మేయర్ సునీల్ రావు అభివర్ణించారు. కేటీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -