రాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండలం మోహినికుంటలో పోత్గల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మోహినికుంట కేసీఆర్ నగర్లో రూ. 3 కోట్ల 27 లక్షల 60 వేల రూపాయలతో పేద ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలుగా నిర్మించిన 65 రెండు పడక గదుల ఇండ్లను ప్రజలకు అంకితం చేశారు.. అనంతరం లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మద్దికుంటలో రైతువేదిక ప్రారంభోత్సవ పాల్గొన్నారు. అక్కడ్నుంచి చీకోడు బయల్దేరి.. రైతువేదిక, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు.. అనంతరం ఆయన . ఆవునూరుకి బయలుదేరి వెళ్లారు.. అక్కడ నిర్మించిన రైతు వేదికలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం హరిదాసునగర్లో గ్రామ కమ్యూనిటీ హల్, శ్మశానవాటిక, పల్లెప్రకృతివనం ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఉత్తమ గ్రామపంచాయితీ అవార్డుకు ఎంపికైనందుకు పాలకవర్గానికి సన్మానం చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement