Thursday, November 21, 2024

క‌రీంన‌గ‌ర్ జిల్లాకు భారీగా నిధులు…కెసిఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం..

క‌రీంన‌గర్ – మానేరు రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించినందుకు కరీంనగర్లో తెలంగాణ చౌక్ లో సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వ‌ర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. అనంత‌రం గంగుల మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్ మా అందరికి సంతృప్తి ని ఇచ్చిందని అన్నారు. సంక్షేమానికి సి ఎం పెద్దపీట వేశార‌న్నారు. . రాష్ట్రానికి సంబంధించి ఫెడరేషన్, ఎం బి సి కి వెయ్యి కోట్లు కేటాయించార‌ని తెలిపారు. అలాగే బ‌డ్జెల్ లో కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేశారంటూ సిఎం కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. .. 2014 కు ముందు ఉన్న నగరం ముఖచిత్రం మారింద‌ని, ఇప్ప‌డు కెసిఆర్ స‌హ‌కారంతో అద్భుత నగరంగా తీర్చి దిద్దామ‌ని చెప్పారు. కరీంనగర్ సిటీ రెన్నోవేషన్ క్రింద 14 కిలో మీటర్ల రోడ్ మొదటిదశలో పూర్తి చేశామ‌ని, ఈ బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించడంతో మానేరురివర్ ఫ్రంట్ కు పురుడు పోసుకున్నట్లు అయిందన్నారు. మానేరు నదితీరం రూపు రేఖలు మారనున్నాయ‌న్నారు.. సబర్మతి కంటే అద్భుతంగా మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మానేరు నది పై అయిదు చెక్ డ్యామ్ ల నిర్మాణం చేస్తున్నాం తెలిపారు. 3.5 కిలో మీటర్ల మెర‌ నీరు ఆగి ఉంటుంద‌ని అంటూ రిటైనింగ్ వాల్ కూడా నిర్మిస్తామ‌న్నారు. మానేరు రివర్ ఫ్రంట్ టెండర్లు త్వరలో పేలుస్తామని తెలిపారు ఈ మేరకు డి పి ఆర్ తయారు చేస్తామని తెలిపారు. హైద్రాబాద్ తరువాత కరీంనగర్ ను టూరిజం స్పాట్ గా తయారు చేస్తామ‌ని పేర్కొన్నారు.

ప్రజల్లో కె సి ఆర్…
ప్రజలలో కెసిఆర్ పై చెక్కు చెదరని అభిమానం ఉందని ఎం ఎల్ సి ఎన్నికల్లో ఋజువయిందని గంగుల అన్నారు. రెండు స్థానాలో కూడా అత్యధిక ఓట్లు తమ అభ్యర్ధులకే వచ్చాయన్నారు. సిట్టింగ్ స్థానం కాకపోయిన హైద్రాబాద్ లో మెజార్టీ సాధించామన్నారు. ఇక సాగర్ ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement