స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన బృహత్తర కార్యక్రమం అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో 1000 మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ మైదానంలో ఒక్కరోజు వెయ్యి మొక్కలు నాటడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచన మేరకు పెద్దపల్లి పట్టణంలో గతంలోనే వేల సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందని, ఇంకా చాల చోట్ల అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి పట్టణాన్ని హరిత పెద్దపల్లి పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.
ఇందుకు సహకరిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ డా.దాసరి మమత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కో అప్షన్ సభ్యులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ప్రజలందరికీ, మున్సిపల్ సిబ్బందికి మెప్మా సిబ్బందికి ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మెప్మా ఏవో మట్ట శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ ఐటిఐ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.