ఓదెల: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కొమిర, పొత్కపల్లి, గుంపుల గ్రామాలలో డీసీఎంఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్, సింగిల్విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ కుమార్‌గౌడ్, సర్పంచ్‌లు ఆళ్ల రాజిరెడ్డి, చిరంజీవి, ఉమా ప్రేమ్‌సాగర్ రెడ్డి, ఎంపిటిసిలు రెడ్డి సరోజన కిషన్ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచులు మహేష్ గౌడ్, లింగారెడ్డి, ఐకేపీ సీసీలు మారెల్ల శ్రీనివాస్, పాలితం మల్లయ్యతోపాటు టిఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement