Friday, November 22, 2024

KNR: కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం.. సీపీ సుబ్బారాయుడు

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మణీయమైనవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు పేర్కొన్నారు. బుధవారం పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చేసిన పోరాటంలో కీలకపాత్ర పోషించారన్నారు. రాజకీయంగా శాసనసభ సభ్యుడిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా, మంత్రి గా వివిధ హోదాల్లో పనిచేశారన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పోరాటంలో మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి వారి వంతు నిరసన తెలియజేశారన్నారు. వారి జీవన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని, అంతేకాకుండా తెలంగాణలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి వారిని గౌరవించిందన్నారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రాజు, లక్ష్మీనారాయణ, ఏ.వో. మునిరామయ్య, ఏసీపీలు జి విజయ్ కుమార్, ప్రతాప్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్, ఐటీ సెల్ ఇంచార్జి సరిలాల్, ఆర్.ఐ. లు సురేష్, రజినీకాంత్, కుమారస్వామి, శేఖర్ బాబు, శ్రీధర్ రెడ్ది, సీపీవో కార్యాలయ సెక్షన్స్ కి చెందిన సూపరింటెండెంట్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement