Tuesday, November 26, 2024

కొండ లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శం : నగర మేయర్ సునీల్ రావు

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని నగర మేయర్ సునీల్ రావు కొనియాడారు. కరీంనగర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పోరేటర్లు, అధికారులు లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి… నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని హైదరాబాద్ మార్గం బైపాస్ రోడ్డు లో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కూడ పూల మాలలు వేసి… నివాళి అర్పించారు. అనంతరం సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… దేశం, తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప పోరాట యోధుడన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానీయిలన్నారు. లక్ష్మణ్ బాపూజీ స్పూర్తీ మలి దశ తెలంగాణ సాధన పోరాటం లో ఇమిడి ఉందన్నారు. ఒక వైపు తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొంటునే…. చాకలి ఐలమ్మ పలువురు ఉద్యమ కారులకు న్యాయవాదిగా సేవలందించారు. లక్ష్మణ్ బాపూజీ స్పూర్తిని మనమంతా కొనసాగించాలని పిలుపు నిచ్చారు.

మలి దశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నంటి ఉండి ప్రోత్సాహం అందిస్తూ… లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం నివాసం నుండే ఉద్యమాన్ని ప్రారంభం చేశారన్నారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృనప్రాయంగా వదిలేసి… ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ముఖ్య కారకులన్నారు. లక్ష్మణ్ బాపూజీ స్పూర్తి ద్వారానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ ను సాధించారని గుర్తు చేశారు. ఇలాంటి మహనీయుని చరిత్ర నేటి యువతకు విద్యార్థి లోకానికి పాఠ్యాంశం కావాలన్నారు. అంతే కాకుండా ఆనాడు ఆంధ్రపాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి… ప్రత్యేక తెలంగాణ కావాలని ఆకాంక్షించిన గొప్ప మహానీయులని అన్నారు. వారు ఆరోజుల్లోనే నిజాం ముల్కి రూల్స్ కు వ్యతిరేకంగా కూడ పోరాటం చేశారని గుర్తుచేశారు. సాధించిన తెలంగాణ రాష్ట్రం లో వారి ఆశయాలను కొనసాగిస్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆర్టికల్చర్ విశ్వ విధ్యాలయానికి లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టు గౌరవించడం చాలా సంతోషం అన్నారు. ఇలాంటి ఎంతోమంది మహనీయులను మనమంతా గౌరవించుకోవాలని… జయంతి, వర్థంతి వేడుకల సమయంలో కాకుండా భావి తరానికి వారి చరిత్ర తెలిసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ఐలేంధర్ యాదవ్, చోప్పరి జయ శ్రీ, తోట రాములు, కాబట్టి లావన్య శ్రీనివాస్, మరియు పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement