Friday, November 22, 2024

విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్ : గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే బాండాగారాలని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. స్ధానిక అమర్ చంద్ కళ్యాణ మంటపంలో 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మేల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ మారిన కాలంలో విధ్యార్థులు మొబైల్ ఫోన్లకే అంకితం అవుతున్నారని, ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. పుస్తక పఠనాశక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. 14 నుండి 20 వరకు నిర్వహించే వారోత్సవాల్లో రోజు వారీ కార్యక్రమాల్లో పచ్చదనం- పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం- కాలుష్యం నియంత్రణ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు. సోమవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ఎమ్మేల్యే అందించారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటిసి బండారి రాంమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, మండల విద్యాధికారి సురేందర్ కుమార్, కౌన్సిలర్ ఇళ్ళందుల కృష్ణమూర్తి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement