కరీంనగర్ లో విక్టరీ అకాడమీ పేరిట నూతనంగా రూపొందించిన లైఫ్ స్కిల్స్ ఇన్స్ ట్యూట్ ను మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు శనివారం ఆవిష్కరించారు. సూర్యనగర్ లో అధునాతన సౌకర్యాలతో వెక్టర్ అకాడమీని రూపొందించారు. ఈ సందర్బంగా అకాడమీ చైర్మన్ పద్మనాభ స్వామి మంత్రిని శాలువాతో సత్కరించారు. అతి తక్కువ ఫీజుతో విద్యార్థులు, గృహిణులకు లైఫ్ స్కిల్స్ నేర్పిస్తామని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి-హరిశంకర్, కార్పొరేటర్లు తుల బాలయ్య, జంగిలి సాగర్, వెక్టర్ అకాడమీ చైర్మన్ పద్మనాభ స్వామి, రమణ, రస్పల్ సింగ్, హరిత, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..