Saturday, November 23, 2024

దేశానికే ఆదర్శంగా కేసీఆర్‌ పాలన.. ఉద్యమకారులకు ఊపిరిపోస్తున్న రామగుండం: కోరుకంటి చంద‌ర్‌

గోదావరిఖని టౌన్‌, (ప్రభన్యూస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలువురు నాయకులకు ఎమ్మెల్యే చందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసిఆర్‌ సంక్షేమ పథకాలకు, ఆయన ముందుచూపు ప్రణాళికలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు.

రామగుండం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఈ ప్రాంతాన్ని సమిష్టిగా అభివృద్ది చేసుకుందామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పించిన, నిరాధారమైన ప్రచారాలు చేసినప్పటికి ప్రజలు నమ్మరన్నారు. ఉద్యమకారుల ఎవరో, రాజకీయ పదవుల కోసం పనిచేసిందో ఎవరోనని ప్రజలకు బాగా తెలుసునన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమకారులు న్యాయనీరతిగా పనిచేస్తారని, ఇప్పటికీ, ఎప్పటికి రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు. రామగుండం ప్రాంత అభివృధ్దిని ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు ప్రజల్లో విషాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మకపోగా, వారి దుష్ప్రచారాలను తిప్పికొడారన్నారు.

నాయకులు చిప్ప రాజేశం ఆధ్వర్యంలో చేరిన తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుడు నంబయ్య, మోరె శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ యువజన విభాగం మాజీ సభ్యుడు దేవరకొండ క్రాంతి, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమాల్లో చురు-కై-న పాత్ర పోషించిన వడ్లూరి శ్రీనివాస్‌, విప్లవ, కార్మిక సంఘ ఉద్యమాలు చేసిన విజయదేవరకొండ బుచ్చన్నలు టిఆర్‌ఎస్‌లో చేరడం పార్టీకి మరింత బలం చేకురిందన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ నడిపల్లి అభిషేక్‌ రావు, కార్పొరెటర్‌ పాముకుంట్ల భాస్కర్‌, నాయకులు బోడ్డు రవీందర్‌ నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్‌, పర్లపల్లి రవి, పిల్లి రమేష్‌, తోకల రమేష్‌, చిన్నమూల విజయ్‌, వీరాలాల్‌, బొడ్డు మహేందర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement