Tuesday, November 26, 2024

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే కేసీఆర్ పౌష్టికాహారం కిట్.. విప్ బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించడంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌ పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో కేసీఆర్ పౌష్టికాహారం కిట్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… ఆసిఫాబాద్ జిల్లాలో తొలి విడతలో భాగంలో జిల్లాలోని 4014 మంది గర్భిణులకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ప, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement