కేసీఆర్ కిట్ బృహత్తర పథకమని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకంలో పది లక్షల మంది గర్భిణీలు లబ్ధిపొందిన సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. నిరుపేదలకు వైద్య ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ లతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital