మెట్‌పల్లి: రైతులను మోసం చేసింది నిజామాబాద్ మాజీ ఎంపీ కవితేనని, తెరాస నాయకులకు దమ్ముంటే నీళ్లు, నిధులు, నియామకాలపై సమాధానం చెప్పాలని బిజెపి నాయకులు ప్రశ్నించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులను మోసం చేసినందునే ఎంపీగా ఒకసారి ఓడించారని గుర్తుంచుకోవాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి గెలిచిన కవిత రైతులకు న్యాయం చేయకుండా వారినే తెరాస నాయకులచే బెదిరించి అక్రమ అరెస్టులు చేయించి తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. రైతులకు ఏమీ చేయలేని వారు ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. చెరుకు రైతులు అసెంబ్లిd ముట్టడి చేసిన విషయం మరిచి రైతుల ముసుగులో తెరాస నాయకులు ప్రకటనలు చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు. పరామర్శల పేరుతో పర్యటించే కర్మ ఎంపీ అరవింద్‌కు లేదని, దమ్ముంటే పోలీసులు లేకుండా ప్రజల మధ్య తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరగాలని సూచించారు. తెరాస, కాంగ్రెస్ నాయకులు ఎంపీ అరవింద్‌కు ఉన్న ప్రజాధారణను చూసి ఓర్వలేకనే విమర్శలకు దిగుతున్నారని, అవసరమైతే ప్రజలు, రైతుల సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో బీజేపీ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికేల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శివ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సుంకెట విజయ్, పట్టణ ఉపాధ్యక్షులు బొడ్ల నరేష్‌లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement